ప్రస్తుతం జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములా మారింది

ప్రస్తుతం జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములా మారింది

నిర్మల్,వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానికంగా ఓ స్థానిక ఫంక్షన్ హాల్లో​జరిగిన టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా మహాసభలకు మంత్రి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. కరోనా టైంలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు సంతాపం ప్రకటించారు. జర్నలిస్టులకు డబుల్​బెడ్​రూం ఇండ్ల కేటాయింపులో అర్హతనుబట్టి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అర్హులందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. సమాజంలో జరుగుతున్న చెడును వివరించాల్సిన బాధ్యత జరల్నిస్టులపై ఉందన్నారు. ప్రభుత్వ పరంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత పత్రికలపై ఉందన్నారు. ప్రస్తుతం జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములా మారిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని పథకాలు అమలు చేయనుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, జడ్పీ చైర్​పర్సన్​విజయలక్ష్మి, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, మున్సిపల్ చైర్మన్​ ఈశ్వర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, టీజీవో ప్రతినిధి శ్యాంనాయక్, ఎంపీపీ రామేశ్వర్​ రెడ్డి, డీసీహెచ్​ దేవేందర్​రెడ్డి, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా పోడుభూముల సర్వే... 

నిర్మల్​జిల్లాలో పోడుభూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మొత్తం పోడు భూముల్లో ఎంత మంది గిరిజనులు సాగు చేస్తున్నారనే వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్​పర్సన్​ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

 గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. నిర్మల్​ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నాయన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.