కరోనా మరణాలను దాచేందుకు కేంద్రం కుట్ర

V6 Velugu Posted on Jun 14, 2021

హైదరాబాద్: దేశంలో కరోనా మృతుల లెక్కలను బయటపెట్టాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. కరోనా మ‌ృతుల విషయంలో కేంద్రం చెబుతున్న వాటికి, వాస్తవ లెక్కలకు మధ్య పొంతన కుదరడం లేదన్నారు. నిజాలను దాస్తోందని కేంద్రంపై ఫైర్ అయ్యారు. కరోనా వల్ల తమ వాళ్లను కోల్పోయిన ప్రతి కుటుంబం ఈ లెక్కలు వెల్లడించాలని కోరుకుంటోందన్నారు. ఈ మేరకు కరోనా మరణాలు అధికార లెక్కల కంటే ఎక్కువేనని చెబుతున్న ఆర్టికల్‌ను ఓవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరోనా మరణాల మీద నిర్వహించిన పరిశోధనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

 

Tagged India, covid deaths, Central GovernmentmCorona Death Toll, MP Asaduddin Owaisi

Latest Videos

Subscribe Now

More News