బీఓబీ మొండి బాకీలు 6 రెట్లు పెరిగాయి

బీఓబీ మొండి బాకీలు 6 రెట్లు పెరిగాయి

4 రెట్లు పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్‌పీఏలు
కోటా: గత ఆరేళ్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) ఆరు రెట్లు పెరిగి రూ. 73,140 కోట్లకు చేరుకున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్‌పీఏలు నాలుగు రెట్లు పెరిగి రూ. 32,561.26 కోట్లను తాకాయి. రైట్‌ టూ ఇన్‌ఫర్మేషన్‌(ఆర్‌‌టీఐ) కింద ఈ విషయాలను బ్యాంకులు బయటపెట్టాయి.

2014 మార్చి 31 నాటికి బీఓబీ ఎన్‌పీఏలు రూ. 11,876 కోట్లుగా ఉన్నాయి. 2019 డిసెంబర్‌‌ నాటికి ఈ ఎన్‌పీఏలు రూ. 73,140 కోట్లకు చేరుకున్నాయి. ఇదే టైమ్‌లో బ్యాంక్ ఎన్‌పీఏ అకౌంట్లు 2,08,035 నుంచి 6,17,306 కు పెరిగాయి. ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్‌పీఏలు 2014, మార్చి నాటికి రూ. 8,068.05 కోట్లుగా ఉండగా, 2020 మార్చి 31 నాటికి రూ. 32,561.26 కోట్లను తాకాయి.