పూర్ణను అభినందించిన NRIలు..

పూర్ణను అభినందించిన NRIలు..

అమెరికా: ఆమె తెలంగాణ బిడ్డ.. పర్వతాలు ఎక్కడంలో తనకు తనే సాటి… పేరు మాలావత్ పూర్ణ. తాజాగా ప్రపంచంలోని అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ ను ఎక్కి సత్తా చాటారు. 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత తనది. దాంతో పాటు… ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్ లోని కార్ట్స్ నెజ్ ను కూడా ఎక్కారు.

అయితే.. ‘మౌంట్ విన్సన్’ ను అధిరోహించిన పూర్ణ ను అభినందిస్తూ డల్లాస్ లోని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.   ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి తాను తీసుకున్న ట్రైనింగ్, జాగ్రత్తలు, మొదలగు విషయాలను అక్కడికొచ్చిన ఎన్నారై లతో పంచుకున్నారు పూర్ణ.

పర్వతాలపై ఉండే వాతావరణం, అక్కడి పరిస్థితులను తాను తీసిన ఫొటోలను ఎన్నారైలకు చూపించారు.   అతి త్వరలోనే ‘ఎదో’ పర్వతాన్ని సైతం అధిరోహించి తన చిరకాల కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు .. భవిష్యత్తులో పర్వతారోహణలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు పూర్ణ. తెలంగాణ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ తనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పూర్ణ ఎవరెస్ట్ ఎక్కిన సాహసాన్ని గుర్తిస్తూ ‘పూర్ణ’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకు సబ్ టైటిల్. కరేజ్ హ్యాజ్ నో లిమిట్.