కశ్మీర్ హమారా హే: లండన్ లోని పాక్ హై కమిషన్ ఎదుట నిరసన

కశ్మీర్ హమారా హే: లండన్ లోని పాక్ హై కమిషన్ ఎదుట నిరసన

పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిని ఖండించారు లండన్ లో నివసిస్తున్న భారతీయులు. దాదపు 100మంది భారతీయులు లండన్ లో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట గుమికూడి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఇకనైనా తీవ్రవాదాన్ని మానుకోవాలని పాకిస్తాన్ ను హెచ్చరించారు. పాకిస్తాన్ ముర్దాబాద్.. కశ్మీర్ హమారా హే.. వందేమాతరం.. హిందుస్తాన్ హమారాహే అంటూ నినాదాలు చేశారు. ఊహించని విధంగా 1000 మంది ఒకేసారి నిరసన చేయడంతో అక్కడి ప్రాంతం మొత్తం పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో నిండిపోయింది.

నిరసనలో భాగంగా పాక్ కు చేస్తున్న మిలటరి సహాయాన్ని నిలిపివేయాలని బ్రిటన్ ను కోరుతూ నినాదాలు చేశారు లండన్ లోని NRIలు. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్ర చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని కోరారు. ఇది హిందూ – ముస్లిం లకు సంబంధించిన విషయం కాదని.. పాక్ ఉగ్ర వైఖరికి వ్యతిరేకంగా సాగిస్తున్న యుద్దమని తెలిపారు. ఆస్ట్రేలియా.. మెల్ బోర్న్ లో కూడా అక్కడి NRI లు పుల్వామా దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.