40 మంది స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ : ఎన్ఆర్ఐ సునీల్

40 మంది స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ : ఎన్ఆర్ఐ సునీల్

దహెగాం, వెలుగు: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఐఫా ప్రతినిధి ఎన్ఆర్ఐ సునీల్ అన్నారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐఫా) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆయన శుక్రవారం దహెగాం మండలం చిన్నరాస్పల్లి జడ్పీ హై స్కూల్ లోని 40 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. దూర ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు స్కూల్ కు నడిచి వస్తున్నారని, వారి కష్టం తీర్చేందుకు ఐఫా ట్రస్ట్ ద్వారా ఈ సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. డీఈవో అశోక్ కుమార్, ఐఫా ప్రతినిధి నాగేశ్వర్ రావు, హెచ్ఎంలు సునీత, ఉదయ్ బాబు, సెక్టోరల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.