ఓట్ చోరీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లెటర్లు

 ఓట్ చోరీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లెటర్లు
జన్నారం, వెలుగు: ఓట్ చోరీ జరిగిందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆధారాలు చూపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదని ఎన్ఎస్​యూఐ స్టేట్ సెక్రటరీ సోహెల్ షా ఆరోపించారు. ఓట్ చోరీపై శనివారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రజలకు  వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ చోరీ విషయంలో బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. 

ఈ విషయాన్ని  ప్రజలందరూ గమనిస్తున్నారని, బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఓట్ చోరీ విషయంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి పోస్టు కార్డు ద్వారా కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, పార్టీ సీనియర్ నాయకులు రియాజొద్దీన్, మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ముత్యం రాజన్న, యుత్ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా సెక్రటరీ అజ్మత్ ఖాన్, మండల ప్రెసిడెంట్ దాసరి గణేశ్, నాయకులు మంద రాజేశ్, నగేశ్ తదిత రులు పాల్గొన్నారు.