జేఈఈ మెయిన్​లో మనోళ్లే టాప్

జేఈఈ మెయిన్​లో మనోళ్లే టాప్
  • ​దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్​
  • అందులో 15 మంది తెలంగాణోళ్లే ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్​​లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు.  దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్​ స్కోర్​ సాధిస్తే, అందులో అత్యధికంగా15 మంది తెలంగాణ స్టూడెంట్సే ఉన్నారు. జేఈఈ మెయిన్–2024 ఏప్రిల్​సెషన్​ ఫలితాలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్​సైట్​jeemain.nta.ac.inలో అందుబాటులో ఉంచింది. 

ఈ ఫలితాలతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్​ కటాఫ్​ మార్కులు, ఆలిండియా ర్యాంక్​ హోల్డర్స్​, రాష్ట్రాలవారీగా టాపర్ల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్​ను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్​)లో నిర్వహించింది. తాజాగా రెండో సెషన్​ను ఏప్రిల్‌‌ 4 నుంచి 12వరకు నిర్వహించగా, సెషన్‌‌ -2 పరీక్షకు 12.57లక్షల మంది రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్‌‌ లిస్ట్‌‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్​కు ఎంపిక చేసింది. 

15 మంది తెలంగాణోళ్లే

మొత్తం 56 మంది 100 పర్సంటైల్స్​ స్కోర్(బీఈ/బీటెక్​)​ సాధించగా.. ఇందులో 15 మంది తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. 

100​ పర్సంటైల్స్​లోని తెలంగాణ విద్యార్థులు: హుందేకర్​ విదిత్, ముత్తవరపు అనూప్, వెంకట సాయితేజ, రెడ్డి అనిల్, రోహణ్​ సాయి పబ్బ, శ్రీయశష్​ మోహన్​ కల్లూరి, కేశం చెన్నబసవారెడ్డి, ఎం. సాయి దివ్యతేజారెడ్డి, రిషి శేఖర్​ శుక్లా, తవ్వ దినేశ్​ రెడ్డి, గంగ శ్రేయష్, రితిష్​ బాలాజీ, టి. జయదేవ్​రెడ్డి, మావూరు జశ్విత్​, దొరిసాల శ్రీనివాసరెడ్డి.