
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన ఏడాది తర్వాత తిరిగి ఎన్టీఆర్ ఈరోజే సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. సముద్ర తీరం బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో షూట్ స్టార్ట్ చేస్తున్నారు. దీనికోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్‌ను సెలెక్ట్ చేశాడు కొరటాల.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేన్నీ బేట్స్ సూపర్ విజన్‌లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ సహా ఇతర నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఫహాడ్ ఫాజిల్ కూడా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.