దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్

దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్

భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న మూవీ మేడ్‌ ఇన్‌ ఇండియా(Made in india). దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి.. నితిన్‌ కక్కర్‌(Nithin kakkar) దర్శకత్వం హవిస్తున్నాడు. ఇటీవలే అధికారికంగా మొదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆరు భాషల్లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ఇండియన్ సినిమాలకు ఎక్కడ బీజం పడింది? ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

కానీ.. ఈ సినిమాలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుంది అంటూ కొన్ని ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఈ ఇమేజెస్ లో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కేగా చాలా బాగా సెట్ అయ్యారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కేగా నటిస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ కానీ.. అవి నిజమైన ఎన్టీఆర్ ఫోటోలు కాదు. 

కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఐ టెక్నాలజీతో ఎన్టీఆర్ ను దాదాసాహెబ్ ఫాల్కేగా క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదిలారు. అవి కాస్త క్షణాల్లో వైరల్ గా మారాయి. దీంతో చాలా మంది మేడ్ ఇన్ ఇండియా సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ను యాక్ట్ చేయమని చెప్పండి అటూ మెసేజెస్ చేస్తూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.