
టీడీపీ మహానాడు కడపలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మహానాడు రెండవ రోజు బుధవారం ( మే 28 ) మరింత ఉత్సాహంగా సాగింది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా కార్యకర్తలకు చిరకాలం గుర్తుండిపోయే కనుక ఇచ్చింది పార్టీ. అదే ఎన్టీఆర్ ఏఐ వీడియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ ప్రసంగించడం సభలో ఉన్నవారందరిని ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ భళా లోకేష్ అంటూ మనవడు లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తడం హైలైట్ గా నిలిచింది.
మహా వేడుకలా, పసుపుమయమై జరుగుతున్న ఈ మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో ప్రతిభ చూపిస్తున్న కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి" అంటూ సాగిన ఎన్టీఆర్ ఏఐ వీడియోలో లోకేష్ ప్రస్తావన పార్టీ క్యాడర్లో జోష్ నింపింది.. మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేశ్ ను చూస్తుంటే ముచ్చటేస్తోందని... భళా మనవడా.. భళా అంటూ లోకేష్‌ను అభినందించారు ఎన్టీఆర్.
అంతే కాకుండా సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలను కూడా పొగిడారు. చంద్రబాబు, మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావిస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్. సరిగ్గా 43 ఏళ్ల కిందట తెలుగువారి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించానని... నేను స్థాపించాను అనేకంటే, పుట్టిందని చెప్పడమే సరైందని అన్నారు ఎన్టీఆర్.
మహానాడు వేదికగా అన్న ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు ప్రస్తావన.#NTRLivesOn#Mahanadu2025#TeluguDesamParty #AndhraPradesh pic.twitter.com/RvPN1R9eah
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2025
ఎన్టీఆర్ ఏఐ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.. స్వయంగా ఎన్టీఆర్ భూమ్మీదకు వచ్చి మాట్లాడుతున్నట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. టెక్నాలజీని వాడడంలో చంద్రబాబును మించినోళ్లు లేరని కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్స్.