Devara Fear Song: మోత మోగిపోతోంది.. దేవర ముంగిట రికార్డ్స్ అన్నీ గల్లంతే

Devara Fear Song: మోత మోగిపోతోంది..  దేవర ముంగిట రికార్డ్స్ అన్నీ గల్లంతే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్ఫుల్ అంటే ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన దేవర ఫియర్ సాంగ్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా వచ్చిన ఈ పాటను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపరచి, పాడారు కూడా. 

చాలా మాస్ అండ్ స్టైలీష్ గా ఉన్న ఈ పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దూకే ధైర్యంగా జాగ్రత్త..దేవర ముందు నువ్వెంత”అంటూ సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, నెటిజన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటిరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి టాప్‌ వన్‌ లో ట్రెండ్ అవుతోంది. ఇన్స్టా,  పేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చ నడుస్తోంది. ఈ ఒక్క పాటతో దేవర సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే హిట్ ఇచ్చాడు కొరటాల. ఈ పాట చూసిన ఆడియన్స్ దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు సాధించడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.