Fear Song: ఫియర్ Vs జరగండి..ఐదు రోజుల్లోనే గేమ్ ఛేంజర్ను దాటేసిన దేవర..హిందీలో పది రెట్లు!

Fear Song: ఫియర్ Vs జరగండి..ఐదు రోజుల్లోనే గేమ్ ఛేంజర్ను దాటేసిన దేవర..హిందీలో పది రెట్లు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన దేవర ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా వచ్చిన ఈ పాటను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపరచి,పాడారు కూడా.

అయితే ఇప్పుడు నెటిజన్స్ ఈ పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన జరగండి పాటతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఫియర్ Vsజరగండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే, భారీ అంచనాలు..గ్లోబల్ ఇమేజ్ స్టార్స్ కావడమే బలమైన కారణం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సాంగ్స్ తెలుగు..హిందీ వెర్షన్స్ కి ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకున్నాయో చూసేద్దాం. 

ఇప్పటి వరకు (మే 25) చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన జరగండి పాట తెలుగు వెర్షన్‍కు యూట్యూబ్‍లో  దాదాపు 31.15 మిలియన్ (3.11 కోట్లు) వ్యూస్ వచ్చాయి.అయితే,ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ కు కేవలం ఐదు రోజుల్లోనే 31.40 మిలియన్ (3.14కోట్లు) వ్యూస్ క్రాస్ అయింది.ప్రస్తుతం ఈ ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఫియర్ సాంగ్ భారీ వ్యూస్ సాధించే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.

హిందీ వెర్షన్‍ చూసుకుంటే..

గేమ్ ఛేంజర్ జరగండి పాటతో పోలిస్తే ఫియర్ సాంగ్‍కే ఇప్పటి వరకు భారీగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‍లో జరగండి లిరికల్ హిందీ సాంగ్‍కు ఇప్పటి వరకు సుమారు 1.7 మిలియన్ (17 లక్షలు) వ్యూస్ రాగా..దేవర ఫియర్ సాంగ్ హిందీ వెర్షన్‍ యూట్యూబ్‍లో 18 మిలియన్ (1.8 కోట్లు) వ్యూస్ దాటేసి ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉంది. దీన్ని బట్టి చూస్తే..జరగండి సాంగ్ హిందీ వెర్ష‍న్‍తో పోలిస్తే ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ హిందీలో ఇప్పటికే 10 రెట్లు ఎక్కువగా వ్యూస్ దక్కించుకుందన్న మాట. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునామీకి అడ్డు రావాలనుకుంటే కొట్టుకుపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.