
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR)..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva) కాంబినేషన్‌లో దేవర(Devara) మూవీ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మూవీ కావడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవరలో ఫస్ట్ సింగిల్ అద్దిరిపోయే కాన్సెప్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న..దేవర చుట్టూ ఏం జరుగబోతుందో..ఆ ఆత్మను ఫస్ట్ సింగిల్ లో ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యేలా అనిరుధ్(Anirudh) మ్యూజిక్ ఉంటుందని సమాచారం. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి(Ramajogayya shastry) లిరిక్స్ లో దేవర ప్రపంచం ఉండేలా పదాలు సమకూరుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దేవర కథలో 'మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలు..దేవుడు అంటే భయం లేదు..చావు అంటే భయం లేదు.. కానీ ఒకే ఒక్కటి అంటే భయం ఉంటుంది వాళ్లకి.. ఆ భయమేంటో తెలియాలంటే దేవర వచ్చే వరకు మీ హార్ట్స్ ను హోల్డ్ చేసి పెట్టి ఉంచండి..అంటూ .. భయం ఉండాలి..భయం అవసరం..'అని కొరటాల చెప్తూ మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు మరోసారి పూనకాలు కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీకపూర్(Janhvi Kapoor) నటిస్తుండగా..సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తున్నారు.ఈ మూవీని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా APR 5న 2024 లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.