రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు

రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు

రివ్యూ: ఎన్టీఆర్ మహానాయకుడు

రన్ టైమ్: 2 గంటల 8 నిమిషాలు

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, రానా, సచిన్ కేద్కర్ తదితరులు

మ్యూజిక్: ఎం.ఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

నిర్మాతలు: బాలకృష్ణ,విష్ణు ఇండూరి,సాయి కొర్రపాటి

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 22,2019

కథ:

ఎన్టీఆర్ బయోపిక్  పార్ట్ 2 గా వచ్చిన ‘‘మహానాయకుడు’’ లో ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీ చూపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లింది, తర్వాత అనూహ్య విజయం, నాదెండ్ల మనోహర్ చేతిలో వెన్నుపోటుకు గురవటం లాంటి ఘట్టాలను చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:

మొదటి పార్ట్ లో యంగ్ ఎన్టీఆర్ పాత్రకు సరిగా సూటవలేడని విమర్శలు వచ్చినా.. సెకండ్ పార్ట్ లో మాత్రం అలాంటి నిరాశేం ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ లా ఒదిగిపోయాడు. నటన పరంగా కూడా ఎన్టీఆర్ హావభావాలను సరిగ్గా పలికించాడు.విద్యాబాలన్ పరిణితితో కూడిన నటనతో మరోసారి మెప్పించింది. చంద్రబాబుగా రానా బాగా చేశాడు. నాదెండ్ల పాత్రలో సచిన్ కేద్కర్ అభినయం సూపర్బ్. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ సరిపోయాడు.

టెక్నికల్ వర్క్:

మొదటి పార్ట్ లో ఫర్వాలేదనిపించిన కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాలో అస్సలు ఆకట్టుకోదు. రెండు మూడు పాటలున్నా..అవి వినసొంపుగా లేవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగులు ఆర్టిఫీషియల్ గా అనిపించాయి. సాయి మాధవ్ బుర్రా పెన్ పవర్ ఈ పార్ట్ లో కనిపించలేదు.

విశ్లేషణ:

‘‘కథానాయకుడు’’ తో ఫర్వాలేదనిపించిన ‘‘ఎన్టీఆర్’’ టీమ్.. ఈ సారి ఆయన పొలిటికల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టింది. మొదటి పార్ట్ కే కలెక్షన్లు లేక నీరసపడిన ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తో కమర్షియల్ గా వర్కవుట్ అవ్వటం కష్టమే. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లైఫ్ గురించి మొత్తం చూపించలేదు. బసవతారకం చనిపోయే వరకే మూవీ ఉంటుంది. అందులో కూడా వాళ్ల పార్టీకి ఫుల్ ఫేవర్ గా కనిపిస్తుంది. ఆయన పొలిటికల్ జర్నీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఇతరులను హైలైట్ చేయడం కోసం అసంపూర్తిగా చూపించినట్టనిపిస్తుంది. ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్లింది? అతను ప్రవేశపెట్టిన పథకాలను సరిగా హైలైట్ చేయలేదు. నాదెండ్ల ఎపిసోడ్ ను సినిమా మొత్తంగా తీసుకుని దానిపైన ఫోకస్ పెట్టారు. తద్వారా అసలు పాయింట్ డీవియేట్ అయ్యిందనిపిస్తుంది. అయితే బసవతారం తో ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం పై తీసిన కొన్ని సీన్లు ఎమోషనల్ గా అనిపిస్తాయి. రన్ టైమ్ తక్కువ ఉండటం సినిమాకు ప్లస్సే అయినా.. కొన్ని ఎపిసోడ్లను ల్యాగ్ చేసినట్టనిపిస్తుంది. ఓవరాల్ గా ‘‘ఎన్టీఆర్’’ మహానాయకుడు ఫ్యాన్స్ కు ,పార్టీ కార్యకర్తలకు ఓకే అనిపించినా ఇతరులను మెప్పించదు.