
ఓ వైపు ‘దేవర’.. మరోవైపు ‘వార్ 2’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తన కొత్త చిత్రం షూటింగ్ గురించిన అప్‌డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో మెప్పించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తారక్ కెరీర్‌లో ఇది 31వ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్‌లోనే ఈ చిత్రం మొదలవ్వాల్సి ఉంది. అయితే ‘దేవర’ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆలస్యమైంది. దీంతో ప్రభాస్‌తో తీయాల్సిన ‘సలార్’ సీక్వెల్ పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా మొదలవుతుందని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ సినిమానే ముందుగా స్టార్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక కేజీఎఫ్, సలార్ చిత్రాలను రెండు భాగాలుగా చేసిన నీల్.. ఎన్టీఆర్ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఆగస్టులో ఎన్టీఆర్, నీల్ షూట్ మొదలు కానుండగా, అక్టోబర్‌లో ‘దేవర’ చిత్రం విడుదల కానుంది. హృతిక్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.