హాలీడేను ఎంజయ్ చేస్తున్న ఎన్టీఆర్

హాలీడేను ఎంజయ్ చేస్తున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. కొమురం భీమ్ గా అతని నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై తారక్ దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో NTR31 మూవీ చేయనున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తో గ్యాప్ లేకుండా వర్క్ చేసిన యంగ్ టైగర్.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హాలీడేని ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగా తన భార్యతో కలిసి ఉన్న ఓ అందమైన ఫోటోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ప్రణతి జంట ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలో దర్శనమిచ్చారు. ఈ ఫోటోలో యంగ్ టైగర్, లక్ష్మీ ప్రణతి ఒక టేబుల్ పై ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఇద్దరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. 'ఇలాంటి క్షణాలు..' అంటూ యంగ్ టైగర్ పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరో పంచుకున్న ఫోటో కావడం.. భార్యాభర్తలు ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ చూసిన తారక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)