NTR Voice over : విజ‌య్ దేవ‌ర‌కొండ VD 12 కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌!

NTR Voice over : విజ‌య్ దేవ‌ర‌కొండ VD 12 కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.  ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో షార్ట్ హెయిర్ కట్, గడ్డంతో సర్‌‌ప్రైజ్ చేశాడు విజయ్.  తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 12వ చిత్రం.  శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్‌‌‌‌ వైరల్ అవుతోంది.  ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు ఎన్టీఆర్ వాయిస్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్టు సమాచారం.  

సినిమా  కథతో పాటు, విజయ్ పాత్రను పరిచయం చేసేలా ఈ వాయిస్ ఓవర్ ఉండబోతోందట. ఇందుకోసం పలువురు స్టార్ హీరోలను అనుకున్న మేకర్స్.. చివరకు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ వాయిస్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట.  సితార  సంస్థలో ఎన్టీఆర్

 ‘అరవింద సమేత వీరరాఘవ’ అనే చిత్రంలో నటించాడు.  ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌’ ప్రమోషన్స్‌‌‌‌లో నూ పాల్గొన్నాడు. ఇక తారక్ తాజా చిత్రం ‘దేవర’ను సితార సంస్థ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.