ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్

ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్

నుమాయిస్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌‌‌‌లో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది. వీకెండ్స్, సెలవు దినాల్లో 3 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 

ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.40 కాగా, ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. మహిళలు, పిల్లల కోసం స్పెషల్‌‌‌‌గా ఒక్కో రోజు కేటాయించారు. ఈ నెల 9న మహిళలు, 31న పిల్లలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉచిత బస్సు కారణంగా ఎగ్జిబిషన్‌‌‌‌కు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోందని, ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రో ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఎగ్జిబిషన్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో మెట్రో కౌంటర్ కూడా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.