చదివింది తొమ్మిది... ఆస్తులు రూ.1,609 కోట్లు

చదివింది తొమ్మిది... ఆస్తులు రూ.1,609 కోట్లు

కర్ణాటక  మంత్రి ఎంటీబీ నాగరాజ్ తనకు రూ.1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.  గత మూడేళ్లలో ఆయన ఆస్తులు రూ.400 కోట్లు పెరిగాయి. రాష్ట్రంలోనే నెంబర్ వన్  ధనిక రాజకీయ నాయకుడుగా నాగరాజ్ ఉన్నారు.  2019 ఉప ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ రూ.1,200 కోట్లుగా చూపించారు.  హోస్కోట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నాగరాజ్ తన భార్యతో కలిసి రూ.536 కోట్ల చరాస్తులు, రూ. 1073 కోట్ల స్థిరాస్తులు, రూ. 98.36 కోట్ల అప్పులు ఉన్నట్లుగా తెలిపారు. 

వ్యవసాయం, వ్యాపారం ప్రధాన వృత్తిగా పేర్కొన్న నాగరాజ్ ... తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తరువాత బీజేపీలో చేరారు.  కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా తన ఆస్తులు, రూ.1,414 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. డీకేసీ వ్యక్తిగత ఆస్తులు రూ.1,214 కోట్లు. ఆయన భార్య ఉష ఆస్తులు రూ.133 కోట్లు, కుమారుడు ఆకాష్ ఆస్తులు రూ.66 కోట్లుగా అఫిడవిట్‌  లో పేర్కొన్నారు.