
ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య పది వేలు దాటింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 10,405 కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 2,52,731. ఈ వైరస్ పుట్టిన చైనాలో 3,248 మరణాలు సంభవించగా.. ఇటలీలో అంతకంటే ఎక్కువగా 3,405 మరణాలు నమోదయ్యాయి. గురువారం ఒక్క రోజే ఆ దేశంలో 427 మంది మరణించారు.
మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మొత్తం 206 కేసులు నమోదు కాగా శుక్రవారం 12 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 5గురు చనిపోయారు.
భారత్‌లో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరక్టర్ డాక్టర్ రమణన్ లక్ష్మీనారయణ తెలిపారు. త్వరలోనే ఈ పరిస్థితి ఇండియాలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.