గుడ్‌ న్యూస్‌: యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ అయిన వారే ఎక్కువ

గుడ్‌ న్యూస్‌: యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ అయిన వారే ఎక్కువ
  • వెల్లడించిన ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కరోనాతో ఇబ్బంది పడుతూ.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనానికి కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలో యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ రేట్‌ ఎక్కువగా ఉందని, వ్యాధి బారిన పడిన వారు క్రమంగా కోలుకుంటున్నారని చెప్పింది. బాధితుల కంటే రికవరీ అయిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటి సారని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 1,35,206 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, ఇంకా 1,33,632 మంది హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని అన్నారు. అంటే 48.99 శాతం మంది పేషంట్లు కోలుకుంటున్నారు. రోజు రోజుకి కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ఢిల్లీలోని సఫ్దర్‌‌జంగ్‌ హాస్పిటల్‌ డాక్టర్‌‌ నీరజా గుప్తా అన్నారు. చనిపోయిన వారి సంఖ్య 7,745కు చేరినట్లు తెలిపింది. మన దేశంలో గడిచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. కేసుల పెరుగుదల ఇలానే ఉంటే ఒక్కరోజులోనే యూకే బీట్‌ చేసి ఐదో స్థానం నుంచి నాలుగో ప్లేస్‌కు చేరుకుంటాము.