లీగల్‌గా మా పెళ్లి చెల్లదు.. మరి విడాకులెందుకు? 

V6 Velugu Posted on Jun 09, 2021

తనకు నిఖిల్ జైన్‌తో జరిగిన పెళ్లి చెల్లదని బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తేల్చిచెప్పారు. ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో గత కొన్ని నెలలుగా వారిద్దరూ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నుస్రత్ గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు రావడం.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధంలేదని నిఖిల్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటినిపై నుస్రత్ స్పందించింది. 

తామిద్దరం విడిపోయి చాలా కాలం అయిందని.. అయినా ఆ విషయం తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కాబట్టి దాని గురించి బయటకు మాట్లాడలేదని ఆమె అన్నారు. రెండేళ్ల క్రితం టర్కీలో నిఖిల్ జైన్‌తో జరిగిన పెళ్లి టర్కిష్ వివాహ నిబంధన ప్రకారం చెల్లదని ఆమె అన్నారు. ‘విదేశీ గడ్డపై జరిగిన మా పెళ్లి.. టర్కిష్ వివాహ నిబంధన ప్రకారం చెల్లదు. ఇది ఒక కులాంతర వివాహం. ఇటువంటి వివాహాలకు భారతదేశంలో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ధృవీకరణ అవసరం. కానీ మా పెళ్లికి ఎటువంటి ధృవీకరణ లేదు. భారత రాజ్యాంగం ప్రకారం.. మాది వివాహం కాదు. మాది జస్ట్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మాత్రమే. అందుకే మేం విడాకులు తీసుకోవలసని అవసరం లేదు’అని నుస్రత్ స్పష్టం చేశారు. 

Tagged west bengal, marriage, TMC MP Nusrat Jahan, Nikhil Jain, Nusrat Jahan, interfaith marriage

Latest Videos

Subscribe Now

More News