
ఎడపల్లి, వెలుగు : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 16 మంది టిబీ రోగులకు డాక్టర్ వినీత్ రెడ్డి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కిట్లు అందించగా, ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారంతో కిట్లు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. టీబీ రోగుల్లో రోగనిరోధక శక్తిని పెంచి, త్వరగా కోలుకోవడానికి ఈ కిట్లు ఉపయోగపడుతాయన్నారు. టీబీ సీనియర్ సూపర్వైజర్ అయూన్ అహ్మద్, పీహెచ్‌సీ సూపర్వైజర్లు దేవేందర్, రాజేశ్వర్, ఆయుష్ డాక్టర్ వెంకటేశ్, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.
తగిలేపల్లిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్
వర్ని : మండలంలోని తగిలేపల్లి గ్రామంలో సోమవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. 74 మందికి ఛాతీ ఎక్స్రే, 52 మందికి తెమడ పరీక్షలు, బీపీ, షుగర్, హెచ్ఐవీ పరీక్షలు చేసినట్లు టీబీ సూపర్వైజర్ అర్షద్ తెలిపారు. ఎంపీహెచ్ఈవో శ్రీనివాస్, ఎంపీహెచ్వో జ్యోతి
పాల్గొన్నారు.