వైట్‌వాష్ తప్పించుకున్న మిథాలీసేన

వైట్‌వాష్ తప్పించుకున్న మిథాలీసేన

క్వీన్స్ టౌన్:  న్యూజిలాండ్ టూర్ లో వరుస ఓటములతో డీలాపడ్డ ఇండియా విమెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌ ఎట్టకేలకు ఓ విక్టరీని అందుకుంది. ఇప్పటికే 0–4తో వన్డే సిరీస్ కోల్పోయిన మిథాలీసేన గురువారం జరిగిన ఐదో  మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి వైట్‌‌‌‌‌‌‌‌వాష్ తప్పించుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (71), హర్మన్ ప్రీత్ కౌర్‌‌‌‌‌‌‌‌ (63), మిథాలీ రాజ్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్ ఇచ్చిన 252 రన్స్ టార్గెట్ ను ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేజ్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 251/9 స్కోర్ చేసింది. అమెలియా కెర్ (66) హాఫ్ సెంచరీతో రాణించింది.