NZ vs RSA: డికాక్, డస్సెన్ సెంచరీలు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్

 NZ vs RSA: డికాక్, డస్సెన్ సెంచరీలు.. న్యూజిలాండ్  ముందు భారీ టార్గెట్

న్యూజిలాండ్‍తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు వీరవిహారం చేశారు. క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు), వాండ‌ర్ డ‌స్స‌న్(133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులు) శతకాలు బాధగా, ఆఖరిలో డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. దీంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సఫారీ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఎప్పటిలానే ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(24) మరోసారి విఫలమయ్యాడు. అదే వారికి కలిసొచ్చింది. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన వాండ‌ర్ డ‌స్స‌న్, డికాక్‌తో జతకలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో డికాక్(114) టోర్నీలో నాలుగో సెంచరీ పూర్తిచేసుకోగా.. వాండ‌ర్ డ‌స్స‌న్(133) రెండో శతకాన్ని నమోదు చేశాడు. ఆఖరిలో డికాక్ వెనుదిరిగినా అతని స్థానంలో వచ్చిన  డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించాడు.

ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.  పోటీపడి పరుగులిచ్చారు. గాయం కారణంగా మ్యాట్ హెన్రీ మ్యాచ్ మధ్యలోనే వైదొలగడం వారిని మరింత దెబ్బకొట్టింది. టిమ్ సౌథీ, జిమ్మీ నీషామ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.