ఓ భామ.. అయ్యో రామ మూవీ టైటిల్ పోస్టర్‌‌ లాంచ్

ఓ భామ.. అయ్యో రామ మూవీ టైటిల్ పోస్టర్‌‌ లాంచ్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్‌‌ హీరోగా మరో కొత్త చిత్రం మొదలైంది. ‘ఓ భామ అయ్యో రామ’ టైటిల్‌‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకుడు. మాళవిక మనోజ్ హీరోయిన్.  హ‌‌రీష్ న‌‌ల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా,  ద‌‌ర్శకులు వ‌‌శిష్ట కెమెరా స్విచాన్ చేశారు. శైలేష్  కొలను  స్కిప్ట్‌‌ను  అంద‌‌జేశాడు.  

టైటిల్ పోస్టర్‌‌ను ద‌‌ర్శకులు విజయ్ క‌‌న‌‌క‌‌మేడ‌‌ల‌‌, కిషోర్ తిరుమ‌‌ల‌‌,  నిర్మాత‌‌ సుద‌‌ర్శన్ రెడ్డి లాంచ్ చేశారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ ‘మంచి క‌‌థ‌‌తో ఈ చిత్రాన్ని తెర‌‌కెక్కిస్తున్నాం.  ఎప్పుడెప్పుడు  షూటింగ్‌‌కు వెళ‌‌దామా అని ఎదురుచూస్తున్నా’ అన్నాడు.  కీలక పాత్ర పోషిస్తున్న ‘నువ్వునేను’ ఫేమ్ అనిత మాట్లాడుతూ ‘నా సెకండ్ ఇన్నింగ్స్‌‌కు పెర్ఫెక్ట్‌‌గా కుదిరిన చిత్రమిది’ అని చెప్పింది. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు.  రథన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు దిల్ రాజు బ్యానర్‌‌‌‌లో సుహాస్ హీరోగా ఓ  చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన టీమ్.. మే 24న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.