హైటెక్ దొంగలు : విమానంలో దోపిడి..రూ.77 కోట్లు చోరీ

హైటెక్ దొంగలు : విమానంలో దోపిడి..రూ.77 కోట్లు చోరీ

రాత్రి సమయంలో బస్సులను ఆపి దోపిడి చేసే దొంగలను చూశాం..రైళ్లను ఆపి దొచుకున్న సంఘటనలు చూశాం. కానీ ఈ దొంగలు ఏకంగా ఫ్లైట్ లోనే దోపిడి చేశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అల్బేనియా రాజధాని టిరానలో విమానం నుంచి రూ. 77 కోట్లు విలువైన 10 మిలియన్‌ యూరోలను దోపిడీ చేశారు దొంగలు. ఒక ఆస్ట్రెలియా విమానం టిరాన ఎయిర్‌ పోర్టుకు చేరుకొంది. దీనిలోకి ప్రయాణికులు ఎక్కగానే టేకాఫ్‌ కు రెడీ అయ్యింది.  ఈ క్రమంలో అగ్నిమాపక దళం వ్యాన్‌ సాయంతో నలుగురు దుండగులు చొరబడ్డారు. వీరు డైరెక్ట్ గా రన్‌ వే దగ్గర ఉన్న విమానం సమీపంలోకి వెళ్లి, పైలట్లను తుపాకులతో బెదిరించారు.

వారిని నేలపై పడుకోబెట్టి అక్కడ ఉన్న డబ్బుతో ఉడాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ దొంగలపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక దొంగ మృతి చెందాడు. అతని నుంచి ఏకే47, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దొంగతనంలో 210 మిలియన్‌ యూరోలు పోయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు.  నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.