ఓబులాపురం మైనింగ్ కేసు.. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితులు

ఓబులాపురం మైనింగ్ కేసు.. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితులు

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ తీర్పును కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టును కోరారు. నిందితులు దాఖలు చేసిన ఈ అప్పీల్ పిటిషన్ను మే 21న హైకోర్టు విచారించనుంది.

ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌‌ రెడ్డి సహా నలుగురిని సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నలుగురికీ ఏడేండ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి ఐఏఎస్‌‌ కృపానందరెడ్డిని నిర్దోషులుగా ప్రకటించింది.

ALSO READ | UCO Bank: యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరెస్ట్.. రూ.6వేల 200 కోట్ల కుంభకోణంలో ఈడీ దూకుడు..

దాదాపు 15 ఏండ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో ఇటీవలే తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ మెహ్ఫాజ్ అలీ ఖాన్, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మైనింగ్ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా వీరిని దోషులుగా తేల్చిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. 

దీంతో సీబీఐ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ ఎస్కార్ట్‌‌‌‌ తో చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. వీరికి జైలులో ఖైదీ నంబర్లను ఖరారు చేశారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అధికారిని శ్రీలక్ష్మీని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.