ధోనీ రాజ‌కీయాల్లోకి రావాలి.. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పిలుపు

ధోనీ రాజ‌కీయాల్లోకి రావాలి..  ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పిలుపు

ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహించిన ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రాజకీయాల్లోకి రావాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కోరారు. ధోనిని భవిష్యత్తు నాయకుడిగా అభివర్ణించిన ఆయన.. రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు.

Also Read : ప్రశ్నాపత్రం లీకేజీలో 100కు చేరనున్న అరెస్ట్‌ల సంఖ్య : హైదరాబాద్ సీపీ

ఐపీఎల్ లో ధోని మరో ఏడాది ఆడితే చూడాలనుకునే వారిలో తానూ ఒకడినని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కానీ అలా ఎక్కువ కాలం జరగాలని ఆశించలేమని, ధోని రాజకీయాల గురించి కూడా ఆలోచన చేస్తాడని నమ్ముతున్నానన్నారు. ఎన్సీసీ సమీక్షా ప్యానెల్ లో భైజయంత్ పాండా (బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు), ధోనీతో కలిసి తాను పనిచేశానని, అతను క్రీడారంగంలో ఎంత చురుగ్గా ఉంటాడో, ఇతర విషయాల్లోనూ అంతే చురుగ్గా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. ఇతరులతో సులువుగా కలిసిపోయే మనస్తత్వం, ఎంతో వినయశీలి, వినూత్నంగా ఆలోచిస్తాడని.. కచ్చితంగా అతను భవిష్యత్తు నాయకుడు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. 2024, 2025లోనూ ధోనీ ఐపీఎల్ ఆడాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ అభిమానులారా.. ఇక ఆటలో ధోనీ గురించి మర్చిపోండి అంటూ ఇంకొందరు రిప్లై ఇస్తున్నారు.

https://twitter.com/anandmahindra/status/1663430787558178816