ఆరోగ్యం, గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

ఆరోగ్యం, గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
  • ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కోదాడ, వెలుగు :  సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌‌‌‌లో ఆరోగ్యంతో పాటు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుప్త నిధులు దొరుకుతాయని కొందరు వ్యక్తులు చెప్పడంతో తన ఇంట్లో పూజలు చేసేందుకు పద్మ ఒప్పుకుంది. 

మంగళవారం రాత్రి క్షుద్ర పూజలు చేయడంతో పాటు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా విషయం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పద్మ, ఓ మైనర్‌‌‌‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.