
కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఘనంగా ఈ ఏడాదికి ముగింపు పలికి..సరికొత్తగా 2023కు స్వాగతం పలికేందుకు అన్ని దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ..వరల్డ్ వైడ్గా మొదటిసారిగా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుగుతాయి..చివరగా ఏ దశంలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తారో చూద్దాం..
న్యూ ఇయర్ అంటేనే సంబరం. ఈ సందర్భంగా ప్రపంచం విభిన్న రీతిలో సంబరాలను జరుపుకోవాలని అనుకుంటుంది. ఇక డిసెంబర్ 31న వివిధ దేశాల్లోని ప్రజలు.. పటాకులు కాల్చుతూ..డ్రింక్ చేస్తూ..కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టలేవు. కొన్ని దేశాలు ముందుగా.. మరికొన్ని దేశాలు లేట్గా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి.
మొదటి దేశం..
దాదాపు 4 వేల ఏళ్ల క్రితం ఇరాక్‌లోని బేబీలాన్ ప్రాంతం ప్రపంచ దేశాల కంటే ముందుగా న్యూఇయర్కి వెల్ కమ్ చెప్పేది. అయితే కాలానుగుణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో ..ప్రస్తుతం ఓసియానియా ప్రాంతం అన్ని దేశాల కంటే ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఓసియానియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను కలిపే ప్రాంతం. టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ఓసియానాలోనివే. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలకంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకే ఓసియానియాలో కొత్త సంవత్సర సంబరాలు మొదలవుతాయి.
చివరది దేశం..
ప్రపంచ వ్యాప్తంగా అందరి కంటే ముందు ఓసియానియా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటే..అందరి కంటే చివరగా న్యూఇయర్ కు స్వాగతం పలికే దేశం బేకర్, హౌలాండ్ ద్వీపాలు. ఇవి అమెరికా సమీపంలో ఉంటాయి. భారత కాలమానం ప్రకారం జనవరి 1 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ ప్రాంత ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు.