ఏపీ సీఎం జగన్‌కు ఆక్టోపస్ భద్రత

ఏపీ సీఎం జగన్‌కు ఆక్టోపస్ భద్రత

మే 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రజలకోసం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సీఎం హోదాలో ఆయనకు ఇప్పటికే ‘జెడ్’ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. తాజాగా ఆయన భద్రతను మరింత కట్టదిట్టం చేస్తూ ఆక్టోపస్ భద్రతను కూడా కల్పించారు. సీఎం జగన్‌కు కేటాయించిన ఆక్టోపస్ బృందంలో 32 మంది సిబ్బంది ఉంటారు. వారిని ఐదు భాగాలుగా విభజించారు.

ముఖ్యమంత్రి భద్రతను పెంచడానికి గల కారణాలు ఏవీ తెలియరాలేదు. అయితే సీఎం జగన్ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ విషయం ప్రకటించిన మరుసటి రోజు ఆయనకు ఆక్టోపస్ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతితో పాటు విశాఖపట్నం మరియు కర్నూల్‌లను కూడా ఇతర రాజధానులుగా ఏర్పాటుచేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో అమరావతి చుట్టుపక్కల రైతులు నిరసనలకు దిగారు.

More News…

హాస్యనటుడు అలీకి మాతృ వియోగం
నన్ను ఉరి తీయొద్దు: నిర్భయ దోషి పవన్ పిటిషన్‌పై కోర్టులో హైడ్రామా
ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్
నిర్భయ దోషుల్ని త్వరగా ఉరి తీయండి: సుప్రీంలో పిల్

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?