OGTrailer: ‘ఓజీ’ ట్రైలర్ పోస్ట్పోన్.. ఎమోషన్స్తో ఆడుకోవద్దంటూ ఫ్యాన్స్ ఆగ్రహం!

OGTrailer: ‘ఓజీ’ ట్రైలర్ పోస్ట్పోన్.. ఎమోషన్స్తో ఆడుకోవద్దంటూ ఫ్యాన్స్ ఆగ్రహం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG) ట్రైలర్.. ఇవాళ సాయంత్రానికి రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 21న) 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ కావాల్సిన ట్రైలర్ను పోస్ట్పోన్ చేసారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం LB స్టేడియంలో జరగబోయే కాన్సర్ట్లో ట్రైలర్ను రిలీజ్ చేస్తామని X లో పోస్ట్ చేసారు. ఈ విషయాన్ని మేకర్స్ తమ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అయితే, గత రెండ్రోజుల నుంచి వీపరీతంగా ఆశలు పెంచి.. సడెన్గా ఆవిరి చేయడం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫైర్స్టోర్మ్ అనేది పక్కనపెడితే.. ఇపుడు ట్రైలర్ ఆలస్యంతో ఫ్యాన్స్లో ఫైర్ పెంచారు.

ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవద్దని, అంతా మీ ఇష్టమే అయితే.. ఇక ఫ్యాన్స్ ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా అంత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉడికిపోతుంది. దానికితోడు ఫ్యాన్స్ వేడిని చల్లార్చే ట్వీట్ ఒక్కటికూడా.. మేకర్స్ మళ్ళీ చేయకపోవడం గమనార్హం!

ఇదిలా ఉంటే.. గురువారం (సెప్టెంబర్ 25న) ఓజీ విడుదలకు సర్వం సిద్ధమైంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న చిరుతలాగా లెక్కలను పెంచుతూ వేటాడుతున్నాడు పవన్. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ వస్తుందంటూ అంచనాలు పెంచి ఫ్యాన్స్ని అలెర్ట్ చేశాడు. కానీ, మేకర్స్ మాత్రం డిస్సప్పాయింట్ చేశారు. 

ఈ సినిమాలో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ గ్యాంగ్ స్టార్గా ఓజాస్‌‌‌‌ గంభీర (పవన్ కల్యాణ్) నటించగా.. ఒమీ (ఇమ్రాన్ హష్మీ) విలన్‌‌‌‌గా కనిపిస్తున్నాడు. పవన్కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.