డాక్టర్ ను చితకబాది అదే హస్పిటల్ లో అడ్మిట్

డాక్టర్ ను చితకబాది అదే హస్పిటల్ లో అడ్మిట్

ఉత్తరప్రదేశ్: వైద్యో నారాయణీ హరీ అంటారు. కానీ ఓ డాక్టర్ డ్యూటీకి ఫుల్లుగా తాగి వచ్చి, వచ్చిరాని ట్రీట్ మెంట్ తో పేషంట్ ప్రాణాలు తీయబోయాడు. మద్యం మత్తులోని పేషంట్ కు ట్రీట్ మెంట్ చేస్తుండగా డాక్టర్ ను అడ్డుకున్నారు రోగి బంధువులు. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని డాక్టర్ ను కోరారు. అయినా వినక పోయేసరికి డాక్టర్ కు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన ఉత్రరప్రదేశ్ లో జరిగింది.

రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాస్‌గంజ్‌ ప్రభుత్వాస్పత్రిలో హస్పిటల్ కి తీసుకొచ్చారు. ఆ సమయంలో డాక్టర్ మద్యం మత్తులో ఉన్నాడు. ట్రీట్ మెంట్ వద్దంటూ రోగి బంధువులు వేడుకున్నారు. డాక్టర్ వినకపోయేసరికి హస్పిటల్ లో ఘర్షణ జరిగింది. ఒక దివ్యాంగుడిపై డాక్టర్ చేయిచేసుకున్నాడు. దీంతో సీరియస్ అయిన ప్రజలు డాక్టర్ ని చితకబాదారు. అదే హస్పిటల్ లో అడ్మిట్ చేశారు.