IND vs SA : తొలి టికెట్‌ కొన్న ఒడిశా సీఎం

IND vs SA : తొలి టికెట్‌ కొన్న ఒడిశా సీఎం

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కి టీంఇండియా రెడీ అవుతోంది.. జూన్ 9 న ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇక రెండో టీ20 మ్యాచ్ జూన్ 12న  కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం తొలి టికెట్ ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు... ఒడిశా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఒడిశా క్రికెట్ సంఘం కార్యదర్శి సంజయ్ బెహెరా సోమవారం ముఖ్యమంత్రికి టికెట్ ను అందజేశారు. టిక్కెట్ల విక్రయం, క్రికెట్ మ్యాచ్ సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లను చేశామని సంజయ్ బెహెరా సీఎంకు వివరించారు.

టీ20 సిరీస్‌ షెడ్యూల్ ఇలా.. 


మొదటి టీ20: జూన్‌ 9- గురువారం : అరుణ్‌ జైట్లీ స్టేడియం  : ఢిల్లీ
రెండో టీ20: జూన్‌ 12- ఆదివారం : బరాబతి స్టేడియం  : కటక్‌
మూడో టీ20: జూన్‌ 14- మంగళవారం  : డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం  : విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్‌ 17, శుక్రవారం :  సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం :  రాజ్‌కోట్‌ 
ఐదో టీ20: జూన్‌ 19- ఆదివారం : ఎం.చిన్నస్వామి స్టేడియం :   బెంగళూరు

అన్ని టీ20  మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకే ప్రారంభమవుతాయి.

భారత జట్టు: కేఎల్ రాహుల్ (సి), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(డబ్ల్యూకే), దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ మరియు ఉమ్రాన్ మాలిక్.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (సి), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిస్సో సెయింట్ రబాడ, తబ్రాస్ రబాడా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్