
ఐపీఎల్ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. నరాలు తెగే టెన్షన్ లో ఐపీఎల్ ఎంజాయ్ చేయడంలో ఉండే కిక్కే వేరేలా ఉంటుంది. ఆ కిక్కే కానిస్టేబుల్ ప్రాణాలు పోయేలా చేసింది. ఒడిశా రాయ్‌గడ్ జిల్లా నాబరంగ్‌పూర్‌కి చెందిన యోగేశ్వర్ దాస్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మూడో అంతస్తు పైన మొబైల్‌లో మ్యాచ్ వీక్షిస్తున్నాడు. మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఎక్కడున్నాడనేది చూసుకోలేదు. దీంతో అదుపుతప్పి మూడో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిలా లాభంలేకుండా పోయింది. తీవ్రంగా గాయాలు కావడంతో యోగేశ్వర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. సరదా కోసం మ్యాచ్ చూస్తే ఇలా జరిగిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబసభ్యుల రోదన ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.