చైల్డ్ మ్యారేజెస్ పై ఇన్ఫర్మేషన్ ఇస్తే..5 వేల బహుమతి

చైల్డ్ మ్యారేజెస్ పై ఇన్ఫర్మేషన్ ఇస్తే..5 వేల బహుమతి

చైల్డ్ మ్యారేజెస్  గురించి సమాచారం ఇస్తే రూ. 5 వేలు బహుమతి ఇస్తామని ఒడిశాలోని గంజాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.  సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. గంజాం జిల్లా కలెక్టర్ విజయ అమృత కులంగే ఈ వివరాలు వెల్లడించారు. “బాల్య వివాహాలు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లే. గ్రామపెద్దల కోపానికి గురి కావాల్సి ఉంటుందని అందరూ భయపడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారి వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఫండ్స్ నుంచి ఈ క్యాష్ రివార్డు ఇస్తాం” అని అన్నారు. ఎన్జీఓలు, సెల్ఫ్  హెల్ప్ గ్రూప్స్ తో కలిసి గత ఏడాది 38 బాల్య వివాహాలను ఆపినట్లు తెలిపారు. సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే బాలికల జీవితాలను కాపాడినవారు అవుతారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైల్డ్ మ్యారేజెస్ కు వ్యతిరేకంగా గత నెల’ ము సచేతన్’ (నాకు తెలుసు)  పేరుతో 3 వేల స్కూళ్లలోని 4.50 లక్షల మంది స్టూడెంట్స్, అంగన్ వాడీ వర్కర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్లతో  ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన నాయకులతో మాట్లాడి చైల్డ్ మ్యారేజెస్ గురించి అవగాహన కల్పించామన్నారు.