వైరల్ గా మారిన లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ డాన్స్

వైరల్ గా మారిన లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ డాన్స్

ఒడిశా లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ డాన్స్ వీడియో...... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షంలో తడుస్తూ తనను తాను మైమరిచిపోయి పసిపిల్లలా డాన్స్ చేశారు ఆఫీసర్ స్నేహాదల్. ఈమె ఇంతలా సంతోష పడటానికి కారణం ఉంది. ఒడిశాలోని సిమ్లిపాల్ ఫారెస్ట్ ఏరియాలో రెండు వారాలుగా కార్చిచ్చు కొనసాగుతోంది. దీంతో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ తో పాటు చుట్టు పక్కల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఇక ఈ వర్షంతో అడవిలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆ ఆనందంలోనే వర్షంలో తడుస్తూ డాన్స్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ స్నేహాదల్.