సమిట్​కు ఒడిశా మహిళా రైతులు

సమిట్​కు ఒడిశా మహిళా రైతులు

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా రైతులు జీ-20 సదస్సులో సెప్టెంబర్ 9-–10 తేదీల్లో మిల్లెలట్​సాగు, వంటలపై వివరించనున్నారు. ఒడిశా మిల్లెట్ మిషన్(ఓఎంఎం) సభ్యులైన కోరాపుట్ జిల్లాకు చెందిన రైమతి ఘియురియా, మయూర్‌‌భంజ్ జిల్లాకు చెందిన సుభాషా మహంత అనే మహిళా రైతులు తమ మిల్లెట్ సాగు జర్నీని, వాటి వినియోగం, మహిళల సాధికారతకు ఎలా దోహదపడింది ప్రదర్శిస్తారు. 

మిల్లెట్ సాగులో ఓఎంఎం తీసుకొచ్చిన టెక్నాలజీ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతు లతో వారు పొందిన ప్రయోజనాన్ని వివరించనున్నారు. సుభాషా మహంత మిల్లెట్ సాగుపై వివరించనుండగా.. మిల్లెట్ ఎలా వినియోగించాలో రైమతి ప్రదర్శించనున్నారు. సమ్మిట్‌‌కు హాజరవుతుడడంపై మహిళా రైతులు ఇద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. ఒడిశా మిల్లెట్​సాగును దేశ, విదేశాల నేతల ముందు ప్రదర్శించడం తమకెంతో గౌరవ ప్రదమైందన్నారు.