ఇంతకుముందు పనిచేసి... పనిచేసి.. అలసిపోయి పడుకునే వాళ్లం. కాని ఇప్పుడు ప్రతి దానికి ఆన్ లైన్ షాపింగ్స్ వచ్చేశాయి.. దాంతో జనాలు ఇప్పుడు ఫోన్ చూసినా, టీవీ చూసినా, ఇంట్లోవాళ్లతో ముచ్చట్లు చెప్పినా, పిల్లలతో కాసేపు ఆడుకున్నా, రకరకాల వంటలు ట్రై చేసినా.. ఇంకా టైం మిగులుతుంది. ఈ టైంలో ఎక్కువమంది పరిస్థితి ఇదే. ఈ టైంలో.. వెరైటీ వడియాలు, ఒరుగులు పెట్టుకుంటే ఫుల్ టైంపాస్ అవుతుంది. ముందు ముందు టైం, మనీ కూడా సేవ్ అవుతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .
బియ్యం వడియాలు: బియ్యంతో రకరకాలుగా వడియాలు పెట్టుకోవచ్చు. బియ్యాన్ని రాత్రి నాన బెట్టి, పొద్దున్నే గ్రైండర్లో మెత్తగాదోశ పిండిలా రుబ్బాలి. తరువాత స్టవ్ మీద పెద్దగిన్నె పెట్టి బియ్యానికి ఏడు రెట్లు నీళ్లు పోయాలి. నీళ్లు మరిగేటప్పుడు రుబ్బుకున్న పిండిని వేస్తూ కలపాలి. దీన్ని చాలా సేవు ఉడికించాలి. బాగా జిగటగా మారి, దగ్గరికి వచ్చాక స్టవ్ మీద సుంచి దించే ముందు ఉప్పు, సువ్వులు, జీలకర్ర, వాము వేయాలి. వీటిని ముందే వేస్తే వడియాలు రంగు మారిపోతాయి. రుచికోసం ఈమిశ్రమంలో టమాటో ముక్కుల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం చల్లారాక చిన్న చిన్న బిళ్లల్లా లేదంటే వడియాల్లో పెట్టుకోవచ్చు. నూనెలో వేగించి తింటే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.
మినప వడియాలు: మినపప్పును రాత్రికి నానబెట్టి పొద్దున్న మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి చిన్న చిన్న ముద్దలా వడియాలు పెట్టాలి. బాగా ఎండాక డ నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వీటితో పులుసు పెట్టిచ్చు టొమాటోతో కలిపి కూడా వండొచ్చు. లేదంటే ఫ్రై కూడాచేసుకోవద్దు. ఎలా వండినా రుచి మాత్రం అదిరిపోద్ది.
►ALSO READ | Good Health : ఇలాంటి ఆహారం తీసుకోండి .. షుగర్ లెవల్స్ కంట్రోల్లోనే ఉంటాయి..!
కాకరకాయ వడియాలు:కాకర కాయల్ని శుభ్రంగా కడిగి, పొడవుగా లేదా గుండ్రంగా చేయాలి. ముక్కలకు కొంచెం పసుపు, ఉప్పు పట్టించి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి.
మరుగుతున్న నీళ్లలోఈ ముక్కలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్క మొత్తబడే వరకు ఉడికించొద్దు. తరువాత నీళ్లను వంపి, ముక్కలను గట్టిగా పిండాలి తర్వాత ఒక క్లాత్ మీద ముక్కలను పరిచి బాగా ఎండబెట్టాలి. ముక్కలు ఎండాయా లేదా అనేది తెలియాలంటే ముక్కలు గలగలమునాలి. ఈ ముక్కలతో ఫ్రై.. పులుసు చేసుకోవచ్చు,ఇలా చేయడం వల్ల కూడ చేదుగా ఉండదు.

