ఆఫీస్​ డెస్క్​ దగ్గర ఈ గాడ్జెట్స్​ తప్పనిసరి

ఆఫీస్​ డెస్క్​ దగ్గర ఈ గాడ్జెట్స్​ తప్పనిసరి

మొన్నటివరకు వర్క్​ ఫ్రం హోమ్​ చేసినవాళ్లలో చాలామంది ఇప్పుడు ఆఫీసులకు వెళ్తున్నారు. అంతేకాదు.. కొందరికైతే పని వల్ల ఎక్కువ టైం ఆఫీసులో ఉండాల్సి వస్తోంది. అలా ఉండడం వల్ల కొన్ని రకాల హెల్త్​ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పైగా ఇన్నాళ్లు ఇంట్లో పనిచేసినప్పుడు ఉన్న కంఫర్ట్స్​ ఇప్పుడు ఆఫీసులో ఉండవు. అందుకని కొన్ని గాడ్జెట్స్​ని ఆఫీస్​ డెస్క్​ దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా పనిచేయొచ్చు. 

కౌంట్​డౌన్​ టైమర్​

ఇంట్లో బద్ధకంగా ఉంటే పర్లేదు. కానీ.. ఆఫీసు పనుల్లో బద్ధకం పనికిరాదు. అందుకే ప్రతి పనికి కొంత టైం పెట్టుకోవాలి. ఆ టైంలోగా పని పూర్తి చేయాలి. అందుకోసం ఇలాంటి టైమర్లను వాడితే సరిపోతుంది. ఇది సెట్​ చేసిన టైంని కౌంట్​ డౌన్​ చేస్తుంది. దీన్ని మీ వర్క్​ టేబుల్​ మీద పెట్టుకుంటే.. ఎప్పటికప్పుడు ఎంత టైంలోపు పని పూర్తి చేయాలనేది చూపెడుతుంది. దీనికి ఎల్​సీడీ డిస్​ప్లే, 6 ప్రి–సెట్​ కౌంట్​డౌన్​లు, స్పీకర్​  ఉంటాయి. 
ధర: 400 రూపాయల నుంచి మొదలు

పోర్టబుల్ పవర్ స్టేషన్

ఈ మధ్య పోర్టబుల్​ పవర్​ స్టేషన్ల వాడకం పెరిగింది. ఇది దాదాపు అన్ని రకాల గాడ్జెట్స్​ని ఛార్జ్​ చేయగలుగుతుంది. కరెంట్​ లేనప్పుడు, ఛార్జింగ్​ అడాప్టర్ ఇంట్లో మరిచిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. ఆఫీస్​లోనే కాదు.. అవుట్​ డోర్​,పిక్నిక్​కి వెళ్లినప్పుడు కూడా ఇది వెంట ఉంటే ఛార్జింగ్​ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎకో ఫ్లో తీసుకొచ్చిన ఈ మాడ్యులర్​ పోర్టబుల్​ పవర్​ స్టేషన్​లో 600 వాట్స్​ పవర్ కెపాసిటీ ఉంటుంది. అంతేకాదు.. 288వాట్​ అవర్​ బేస్ బ్యాటరీ కెపాసిటీ, 1200 వాట్స్​ సర్జ్ కెపాసిటీ ఉంటాయి. గంటలో 0 నుండి 80% ఛార్జ్​ అవుతుంది. ధర: 18,000 రూపాయలు

ఎలిప్టికల్ మెషిన్ 

ఉద్యోగం చేసేవాళ్లలో ఎక్కువమంది టైంతో పాటు పరుగులు పెడుతుంటారు. దాంతో వర్కవుట్స్​ చేసే టైం ఉండదు. పైగా ఆఫీసులో ఒకేచోట చాలా టైం కూర్చోవాలి. అలాంటివాళ్లకు హెల్త్​ ప్రాబ్లమ్స్​ వస్తుంటాయి. అందుకే పనితోపాటు ఎక్సర్​సైజ్​ కూడా చేయాలి. అదెలా అంటారా? అందుకోసం ఈ క్యూబి ఎలిప్టికల్​ మెషిన్​ని​ ఆఫీస్​లో మీరు కూర్చునే సీటు దగ్గర పెట్టుకోవాలి. క్యూబి కంపెనీ తీసుకొచ్చిన ఈ పోర్టబుల్​ ఎలిప్టికల్ మెషిన్​ని టేబుల్​ లేదా కుర్చీ కింద పెట్టుకోవచ్చు. ఇది వాడడం వల్ల కీళ్ల మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. 

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్సర్​సైజ్​ చేయొచ్చు. ఇందులో 8 మోడ్స్​ ఉంటాయి. ఎల్​సీడీ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే ఉంటుంది. అందులో పెడల్​ డిస్టెన్స్, ఎన్ని క్యాలరీ ఖర్చయ్యాయి అనేది చూపిస్తుంది. అంతేకాకుండా... ఈ మెషిన్​ను మొబైల్ యాప్ నుంచి కూడా ఆపరేట్​ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్​ను ట్రాక్ చేయొచ్చు. 
ధర: 27,000 రూపాయలు

సీట్ కుషన్

ఆఫీసుల్లో పనిచేసే చాలామందికి ‘కుర్చీ’ పెద్ద సమస్య. కావాల్సినంత ఎత్తు, కంఫర్ట్​ ఉండవు. అందుకే ఎవర్​లాస్టింగ్​ కంఫర్ట్​ కంపెనీ సీట్​కుషన్​ని అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని ప్యూర్​ మెమరీ ఫోమ్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు. ఏ వయసు వాళ్లకైనా సరిపోతుంది. దీనివల్ల ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చు. 17-అంగుళాల పొడవు,14-అంగుళాల వెడల్పు, 2- అంగుళాల ఎత్తు ఉంటుంది. ఏ కుర్చీలో అయినా వేసుకోవచ్చు. ఇది వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. టైల్​ బోన్​, లోయర్​ బ్యాక్​, సయాటికా పెయిన్​ ఉన్న వాళ్లు దీన్ని వాడితే రిలీఫ్​ ఉంటుంది. 
ధర: 1600 రూపాయలు