
కంది, వెలుగు : భూ రికార్డుల్లో తమ పట్టా భూమిని సర్కారు భూమిగా ఆఫీసర్లు తప్పుగా నమోదు చేశారని, సంవత్సరం నుంచి ఆఫీసు చట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఓ యువకుడు సెల్టవర్ఎక్కాడు. మంగళవారం బాధిత కుటుంబసభ్యులంతా కలిసి తహసీల్దార్ఆఫీసుకు వెళ్లి అడిగినా ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భూ యజమాని తమ్ముడు ఈ పని చేశాడు.
బాధితుడి కథనం ప్రకారం..సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల తండాకు చెందిన జంవత్రావుకు 540/ఈ2లో 2 ఎకరాల ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉంది. కాగా, అకోలా-–నాందేడ్ రోడ్డు విస్తరణలో 10 గుంటల భూమి పోయింది. మిగిలిన భూమిని ఆఫీసర్లు గవర్నమెంట్భూమిగా రికార్డు చేశారు. దీంతో గత ఏడాది నుంచి ఆ భూమిని మార్చాలని జంవత్రావుతో పాటు అతడి తమ్ముడు అనిల్, ఇతర కుటుంబసభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పని చేయకపోవడంతో జంవత్రావు తమ్ముడు అనిల్ మంగళవారం ఆఫీసు ఆవరణలో ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. తమ సమస్యను పరిష్కరించేదాకా దిగనని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో తామంతా తహసీల్దార్ దగ్గరకు వెళ్లి అనిల్ టవర్ఎక్కిన విషయం చెప్పామని, దానికి ఆయన తానేమీ చేయలేనని, ఇష్టం వచ్చినట్టు చేసుకోండని నిర్లక్ష్యంగా మాట్లాడాడని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు. కొద్దిసేపటికి సంగారెడ్డి రూరల్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి బాధితుడితో ఫోన్లో మాట్లాడారు. పరిష్కారానికి హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు