
మంగళూరు: ఓ ప్రయాణికుడు తన కూతురు డైపర్‌లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కర్నాటక లోని మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో వచ్చిన వ్యక్తి తన 21 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని పేస్ట్ రూపంలో లోపల పౌచ్‌లలో దాచి అక్రమంగా తీసుకొచ్చాడు. కస్టమ్స్అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు కూడా ఇలాగే పట్టుబడ్డారు. ఒకరు బంగారాన్ని పేస్ట్ లా మార్చి తన నడుముకు బెల్ట్‌కు కట్టుకొని తీసుకొచ్చాడు. ఇంకో వ్యక్తి తన మలద్వారంలో దాచి తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారులు ఈ ముగ్గరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.