లింగంపేట, వెలుగు: మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలైన పంచాయతీల్లో గురువారం ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ సురేశ్, ఎస్సై దీపక్‌కుమార్ విచారణ చేపట్టారు. మండలంలో 12 గ్రామపంచాయతీల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని సజ్జన్పల్లి,అయ్యపల్లితండా,మాలోత్‌తండా, మాలోత్ సంగ్యానాయక్తండాలో విచారణ జరిపారు.
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎందుకు సింగిల్ నామినేషన్లు దాఖలు చేశారు? ఎవరైనా భయబ్రాంతులకు గురిచేశారా? డబ్బులు ఆశ చూపారా.. అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏకగ్రీవమైతే ప్రభుత్వం నుంచి నిధులు వస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెప్పినట్లు అధికారులు తెలిపారు.
