నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు భర్తీ చేశారు. ఖాళీ పోస్టులను సబ్జెక్టులవారీగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారంగా అర్హులైన వారికి నియామకపత్రాలను అడిషనల్కలెక్టర్ పూర్ణచంద్ర అందజేశారు.
శనివారం డీఈవో కార్యాలయంలో మొత్తం 54 మంది అభ్యర్థులను కౌన్సిలింగ్ కు పిలువగా, 50 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులు వెంటనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విధులకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో భిక్షపతి, జీఈసీవో సరిత తదితరులు పాల్గొన్నారు.