
- ముగిసిన స్టేట్కోటా సెకండ్‌ఫేజ్ కౌన్సిలింగ్
- ఎంసీహెచ్ బిల్డింగ్ లో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు
- ప్రాక్టికల్స్ కోసం జీజీహెచ్‌పై మరో షెడ్ నిర్మాణానికి చర్యలు
- ఈనెల 13 నుంచి తరగతుల ప్రారంభం
జనగామ, వెలుగు : జనగామ గవర్నమెంట్మెడికల్ కాలేజీలో క్లాసుల నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పక్కా బిల్డింగ్అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఏడాది కూడా ప్రైవేటు బిల్డింగ్‌లలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫస్ట్ఇయర్ అడ్మిషన్లు కొనసాగుతుండగా, ఈనెల 13 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కొనసాగుతున్న సీట్ల భర్తీ..
మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ ఫస్ట్ఇయర్ కోసం 100 సీట్లు కేటాయించగా, భర్తీ ప్రక్రియ పూర్తి కావస్తోంది. స్టేట్కోటా సెకండ్‌ఫేజ్ కౌన్సిలింగ్ సోమవారం పూర్తి కాగా, ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ ఆప్షన్ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్టేట్గవర్నమెంట్కోటా 85 సీట్లకు 84 మంది స్టూడెంట్లు, ఆల్ ఇండియా కోటా 15 సీట్లకు 13 మంది స్టూడెంట్లు రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మూడో దశ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లు కూడా భర్తీ కానున్నట్లు చెప్పారు.
జీజీహెచ్‌పై షెడ్ నిర్మాణం..
ప్రస్తుతం జనగామ శివారు ఎంసీహెచ్ హాస్పిటల్ పక్కన మెడికల్ కాలేజీ రన్ అవుతుండగా, రెండు లెక్చర్హాల్స్(తాత్కాలిక షెడ్లు) అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు వస్తున్నందున మరో లెక్చర్ హాల్ అవసరం ఉంది. దీంతో తాత్కాలికంగా ఎంసీహెచ్ హాస్పిటల్‌పై అంతస్తులో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్స్కోసం మరో షెడ్అవసరం ఉండగా, జనగామ జీజీహెచ్బిల్డింగ్ పై తాత్కాలికంగా రూ.50 లక్షలతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కోసం ఎంసీహెచ్ హాస్పిటల్ రెండో అంతస్తును వినియోగిస్తున్నారు. కాలేజీ కార్యకలాపాలు థర్డ్ ఇయర్లోకి అడుగు పెడుతున్నా, ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. గతేడాది అడ్మిషన్ల టైంలోనూ ప్రైవేటు బిల్డింగ్ల వైపు అడుగులు వేసిన అధికారులకు ఈసారీ అదే పరిస్థితి. గతేడాది గర్ల్స్కోసం సిద్దిపేట రోడ్డులోని సుశీలమ్మ వృద్ధాశ్రమంలో హాస్టల్ వసతి కల్పించగా, ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. బాయ్స్కోసం చంపక్హిల్స్సమీపంలోనే ఉన్న డీఆర్డీఏ బిల్డింగ్‌లో హాస్టల్వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలో అందుబాటులోకి పక్కా బిల్డింగ్..
జనగామలోని సిద్దిపేట రోడ్డులో అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ కొత్త బిల్డింగ్పనులు వేగవంతమయ్యాయి. వచ్చే అకడమిక్ఇయర్ వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, హాస్టల్స్ బిల్డింగ్ వచ్చే డిసెంబర్ వరకు అందివ్వాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ పూర్తైతే స్టూడెంట్ల ఇక్కట్లు తొలగనున్నాయి.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నం..
ఫస్ట్ఇయర్ స్టూడెంట్ల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. స్టేట్కోటాలో 84, ఆల్ ఇండియా కోటా 13 మంది రిపోర్ట్ చేశారు. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 13 నుంచి క్లాసులు స్టార్ట్ కానున్నాయి. కొత్త మెడికల్ కాలేజీ బిల్డింగ్ కూడా కొద్ది నెలల్లో అందుబాటులోకి రానుంది.- కే.నాగమణి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జనగామ