కొమురంభీం జిల్లా తిర్యాణి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ శారదపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వంట మనుషులు డుమ్మా కొట్టడంతో విద్యార్థినులే వంటలు చేసుకున్నారని వీ6లో వచ్చిన కథనంపై ఐటీడీఏపీఓ స్పందించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకున్నారు.
తిర్యాణి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో వేతనాలు సరైన సమయానికి రాకపోవడంతో వంట మనుషులు సరిగ్గా పనులకు రావడం లేదు. వారు రాని రోజుల్లో విద్యార్థినులే వంటలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నెల 21న కూడా వంట మనుషులు రాకపోవడంతో స్టూడెంట్స్ వంటలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకున్నారు.