జనగణన ప్రక్రియను పరిశీలించిన ఆఫీసర్లు : ఖమ్మం కలెక్టర్ దివాకర

జనగణన ప్రక్రియను పరిశీలించిన ఆఫీసర్లు : ఖమ్మం కలెక్టర్ దివాకర

కూసుమంచి/ ఎల్కతుర్తి, వెలుగు: జనగణన ప్రక్రియను మంగళవారం ఉన్నతాధికారులు పరిశీలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జరుగుతున్న జనగణనను ఖమ్మం కలెక్టర్​ దివాకర పరిశీలించారు. అంతకుముందు ఆయన కూసుమంచి, తిరుమలాయపాలెం తహసీల్దార్​ ఆఫీసులను సందర్శించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపట్టిన ప్రజాదర్భార్ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన వినతులపై సమీక్షించారు. 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర, బావుపేటలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను ఆర్డీవో, అడిషనల్​ సెన్సెస్​ ఆఫీసర్​ రాథోడ్​ రమేశ్​పరిశీలించారు. ​​ఎల్కతుర్తి మండలంలోని 13 గ్రామాల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో 70 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, 12 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.