కరీంనగర్‌‌ జిల్లాలో .. ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ

కరీంనగర్‌‌ జిల్లాలో ..  ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ

కొడిమ్యాల/మంథని, వెలుగు:  నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పలు  ప్రాంతాల్లో అధికారులు ఫర్టిలైజర్​ షాపులను, గోదామ్​లను తనిఖీ చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్​  ఫెర్టిలైజర్ షాప్ యజమానులతో అవగాహన సదస్సు  నిర్వహించారు.   నిషేధిత రసాయనాలు, విత్తనాలు అమ్మితే  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

కార్యక్రమంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు,  ఎస్సైలు వెంకటకృష్ణ , సందీప్, రాణి వర్మ పాల్గొన్నారు.  కోడిమ్యాలలో  ఏఓ జ్యోతి , స్థానిక ఎస్సై సందీప్ తో  ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీ చేశారు.